రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-12-28T05:30:00+05:30 IST

రోడ్డు ప్రమాదంలో కార్మికుడు మృతిచెందిన సంఘటన మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకున్నది.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), డిసెంబరు 28 : రోడ్డు ప్రమాదంలో కార్మికుడు మృతిచెందిన సంఘటన మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకున్నది. ఎస్‌ఐ రాజుగౌడ్‌ వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌కు చెందిన ప్రతాప్‌ దూబే (49) ఏడాదిగా కాళ్లకల్‌లో నివాసముంటూ, సాగర్‌ ఏసియా అల్యూమినీయం కంపెనీలో మెకానికల్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం విధులకు వెళ్లిన ప్రతాప్‌ దూబే రాత్రి భోజనం చేసేందుకు కాళ్లకల్‌లోని గదికి వెళ్లాడు. రాత్రి 9 గంటలకు తిరిగి వస్తూ హైవే 44 రోడ్డును దాటుతున్నాడు. ఈ క్రమంలో చౌరస్తా వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని మేడ్చల్‌లోని లీలా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు సుచిత్ర వద్ద రష్‌ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు మృతిచెందాడని తెలిపారు. మృతుడి సోదరుడు వినోద్‌కుమార్‌ దూబే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాజుగౌడ్‌ వివరించారు. 

Updated Date - 2021-12-28T05:30:00+05:30 IST