నూరుశాతం చెత్త సేకరణ జరగాలి

ABN , First Publish Date - 2021-03-24T05:48:39+05:30 IST

పట్టణ పరిశుభ్రత దృష్ట్యా ప్రతి వార్డులో చెత్త సేకరణ చేయాలని అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ ఖాన్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

నూరుశాతం చెత్త సేకరణ జరగాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ ఖాన్‌

అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ ఖాన్‌

సిద్దిపేట సిటీ, మార్చి 23 : పట్టణ పరిశుభ్రత దృష్ట్యా ప్రతి వార్డులో చెత్త సేకరణ చేయాలని అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ ఖాన్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ కడవేర్గు రాజనర్సు, కమిషనర్‌ డాక్టర్‌ కెవి.రమణాచారితో కలిసి పట్టణ శానిటేషన్‌ పనులపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటగా శానిటేషన్‌ పనులపై చర్చించారు. ప్రతిరోజు ఉదయాన్నే చెత్త వాహనం ప్రతి ఇంటికెళ్లి చెత్తను సేకరించాలన్నారు. 2020-2021 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా ఇంటి, నీటి పన్ను వసూళ్లపై దృష్టి సారించాలని చెప్పారు. ట్రేడ్‌ లైసెన్స్‌, అడ్వర్టైజ్‌మెంట్‌ కలెక్షన్‌, షాప్‌ రెంట్లను సైతం వసూలు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ నర్సయ్య, రెవెన్యూ, శానిటేషన్‌, టౌన్‌ ప్లానింగ్‌, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-03-24T05:48:39+05:30 IST