చెట్టును ఢీకొని బైక్‌పై నుంచి పడి ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-05-19T05:27:13+05:30 IST

చెట్టును ఢీ కొని బైక్‌పై నుంచి పడి ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

చెట్టును ఢీకొని బైక్‌పై నుంచి పడి ఒకరి మృతి

మరొకరి పరిస్థితి విషమం

కౌడిపల్లి, మే 18 : చెట్టును ఢీ కొని బైక్‌పై నుంచి పడి ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హైవే పెట్రోలింగ్‌ పోలీస్‌ ఏఎ్‌సఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.... హవేళీఘనపురం మండలంలోని దేవుని కుచన్‌పల్లి గ్రామానికి చెందిన వడ్డెర రాజు, వడ్డె కృష్ణ బైక్‌పై మెదక్‌ వైపు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్నారు. కౌడిపల్లి మండలంలోని బట్టెమ్మ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును వీరి బైక్‌ బలంగా ఢీ కొన్నది. దీంతో తీవ్ర గాయాలైన ఇద్దరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో కృష్ణ (37) మృతి చెందాడు. రాజు పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌ఐ రాజశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-19T05:27:13+05:30 IST