పది కిలోల గంజాయిని పట్టుకున్న అధికారులు
ABN , First Publish Date - 2021-03-21T05:30:00+05:30 IST
అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి స్థావరంపై దాడి చేసి 10 కిలోల ఎండు గంజాయి, 356 గంజాయి మొక్కలను పట్టుకుని చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ మహేష్ ఆదివారం తెలిపారు.

నారాయణఖేడ్, మార్చి 21: అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి స్థావరంపై దాడి చేసి 10 కిలోల ఎండు గంజాయి, 356 గంజాయి మొక్కలను పట్టుకుని చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ మహేష్ ఆదివారం తెలిపారు. సిర్గాపూర్ మండలం గరిడేగామకు చెందిన విట్టుగొండ అక్రమంగా గంజాయిని సాగు చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్ శాఖ జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో దాడి చేశారు. గంజాయి మొక్కలు నాలుగు అడుగుల నిడివితో ఉన్నాయన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు.