సొసైటీల్లో పూర్తిస్థాయి సభ్యత్వాలు ఇవ్వడం లేదు
ABN , First Publish Date - 2021-10-26T04:49:56+05:30 IST
ముదిరాజ్‌లను మత్స్యకారులుగా గుర్తించినా మత్స్య సొసైటీల్లో పూర్తిస్థాయిలో సభ్యత్వాలు ఇవ్వడం లేదని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్ అన్నారు.

చిన్నకోడూరు, అక్టోబరు 25 : ముదిరాజ్‌లను మత్స్యకారులుగా గుర్తించినా మత్స్య సొసైటీల్లో పూర్తిస్థాయిలో సభ్యత్వాలు ఇవ్వడం లేదని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్ అన్నారు. ముదిరాజ్ మహాసభ శత జయంత్యోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో ముదిరాజ్‌లు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజ్ మహాసభ ఏర్పడిందన్నారు. అనంతరం కృష్ణస్వామి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసి జెండావిష్కరించారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పెద్దులు, సంఘం సభ్యులు బాలపోచయ్య, శ్రీనివాస్, ఆనందం, అంజయ్య, శ్రీకాంత్, బాల్‌రాజ్, శంకర్, సాయిలు, వికాస్ పాల్గొన్నారు.