వంద రోజుల్లో ఎన్‌ఎ్‌సఎ్‌ఫ తెరిపిస్తామన్న పెద్దాయన ఎక్కడ ?
ABN , First Publish Date - 2021-02-14T06:27:28+05:30 IST
వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ (ఎన్‌ఎ్‌సఎ్‌ఫ) కర్మాగారాన్ని తెరిపిస్తానని మాట ఇచ్చిన పెద్దాయన ఎక్కడున్నాడని కార్మికులు, విపక్ష నాయకులు ప్రశ్నించారు. శనివారం మంబోజిపల్లి ఎన్‌ఎ్‌సఎ్‌ఫ కార్మికులు ఆకలి పోరుయాత్ర నిర్వహించారు. బోధన్ నుంచి వస్తున్న పాదయాత్రకు మద్దతుగా పల్లె సిద్దిరాములుగౌడ్ ఆధ్వర్యంలో మంబోజిపల్లి నుంచి కార్మికులు ఈ పాదయాత్రను నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం జిల్లా నాయకులు గడ్డం శ్రీనివాస్, కంటారెడ్డి తిరుపతిరెడ్డి, మల్లేశం కార్మికులకు సంఘీభావం తెలిపి వారితో కలిసి ఆకలి పోరుయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేఆఫ్ పేరుతో రాష్ట్రంలో ప్రభుత్వం భాగస్వామ్యంలో ఉన్న మూడు కర్మాగారాలను మూసి వేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికులను రోడ్డు పాలు చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం
మండిపడిన కార్మిక, విపక్ష నాయకులు
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికుల ఆకలి పోరుయాత్ర ప్రారంభం
సంఘీభావం తెలిపిన కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పార్టీ నేతలు
మెదక్ రూరల్, ఫిబ్రవరి 13 : వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ (ఎన్‌ఎ్‌సఎ్‌ఫ) కర్మాగారాన్ని తెరిపిస్తానని మాట ఇచ్చిన పెద్దాయన ఎక్కడున్నాడని కార్మికులు, విపక్ష నాయకులు ప్రశ్నించారు. శనివారం మంబోజిపల్లి ఎన్‌ఎ్‌సఎ్‌ఫ కార్మికులు ఆకలి పోరుయాత్ర నిర్వహించారు. బోధన్ నుంచి వస్తున్న పాదయాత్రకు మద్దతుగా పల్లె సిద్దిరాములుగౌడ్ ఆధ్వర్యంలో మంబోజిపల్లి నుంచి కార్మికులు ఈ పాదయాత్రను నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం జిల్లా నాయకులు గడ్డం శ్రీనివాస్, కంటారెడ్డి తిరుపతిరెడ్డి, మల్లేశం కార్మికులకు సంఘీభావం తెలిపి వారితో కలిసి ఆకలి పోరుయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేఆఫ్ పేరుతో రాష్ట్రంలో ప్రభుత్వం భాగస్వామ్యంలో ఉన్న మూడు కర్మాగారాలను మూసి వేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కార్మికులు, రైతులతో చర్చించకుండా అర్ధరాత్రి కర్మాగారాలకు నోటీసులు అంటించి తాళం వేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సీమాంధ్ర పాలనలో ఫ్యాక్టరీలు ప్రైవేట్ పరంలో ఉన్నాయని గగ్గోలు పెట్టిన కేసీఆర్ అఽధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ప్రభుత్వపరం చేస్తానని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. రెండో విడత అధికారంలోకి వచ్చినా కార్మికుల గోడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుతో వందలాది కార్మికులు రోడ్డుపాలయ్యారన్నారు. ఎన్‌ఎ్‌సఎఫ్ కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుల్లో ఇప్పటికే చాలామంది పదవీ విరమణ పొందినా వారికి ఎటువంటి బెనిఫిట్‌లు అందించలేని దౌర్భాగ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. మెదక్ నుంచి కొనసాగుతున్న కార్మికుల ఆకలి పోరుయాత్ర రామాయంపేట వరకు సాగింది. బోధన్ నుంచి వస్తున్న వారితో కలిసి హైదరాబాద్ వరకు తమ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మ్యాడం బాలకృష్ణ, మామిళ్ల ఆంజనేయులు, విజయ్ పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.