సంగారెడ్డి జిల్లా ఏఎస్పీగా నితిక పంత్
ABN , First Publish Date - 2021-11-19T05:20:01+05:30 IST
సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా నితికపంత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2017 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పంత్ మొదట గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా విధులు నిర్వహించి, ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీగా నియమితులయ్యా రు.
సంగారెడ్డి క్రైం, నవంబరు 18 : సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా నితికపంత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2017 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పంత్ మొదట గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా విధులు నిర్వహించి, ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీగా నియమితులయ్యా రు. జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ను ఆమె మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన అడిషనల్ ఎస్పీ కె.సృజన డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయనున్నారు. రెండు సంవత్సరాల పాటు ఆమె జిల్లాలో పనిచేశారు.