న్యూఇయర్‌ జోష్‌..

ABN , First Publish Date - 2022-01-01T03:52:35+05:30 IST

మెదక్‌ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. 2022ను ప్రజలు కేరింతలతో స్వాగతించారు. ఉదయం నుంచే యువతీ, యువకులు వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. మెదక్‌ జిల్లా కేంద్రంతోపాటు తూప్రాన్‌, నర్సాపూర్‌, రామాయంపేట పట్టణాలు, మండల కేంద్రాల్లో వేడుకలు జరుపుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు బాణాసంచా కాల్చి న్యూఇయర్‌ విషెస్‌ చెప్పుకుంటూ సంతోషంగా గడిపారు.

న్యూఇయర్‌ జోష్‌..
మెదక్‌ జిల్లా కేంద్రంలోని ఓ బేకరీలో కొనుగోలుదారుల సందడి

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 31: మెదక్‌ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. 2022ను ప్రజలు కేరింతలతో స్వాగతించారు. ఉదయం నుంచే యువతీ, యువకులు వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. మెదక్‌ జిల్లా కేంద్రంతోపాటు తూప్రాన్‌, నర్సాపూర్‌, రామాయంపేట పట్టణాలు, మండల కేంద్రాల్లో వేడుకలు జరుపుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు బాణాసంచా కాల్చి న్యూఇయర్‌ విషెస్‌ చెప్పుకుంటూ సంతోషంగా గడిపారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలైన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌లలో శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి. దాదాపు గంటసేపు వరకు ఫోన్‌లన్నీ బిజీగా మారిపోయాయి. ఒమిక్రాన్‌ ప్రమాదం పొంచిఉన్న నేపథ్యంలో ప్రజలు కుటుంబ సభ్యులతోనే వేడుకలు జరుపుకున్నారు. యువత మాత్రం స్నేహితులతో ఆనందాన్ని పంచుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా మార్కెట్‌లు కిటకిటలాడాయి. బేకరీల్లో ఆకారాల్లో భారీ కేక్‌లు తయారు చేశారు. ప్రజలు సాయంత్రం నుంచే కేక్‌లను తీసుకెళ్లారు. నాన్‌వెజ్‌, మద్యం ప్రియులు దుకాణాల వద్ద ఎగబడ్డారు. రాత్రి 12 గంటల వరకు మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో విచ్చలవిడిగా మద్యాన్ని కొనుగోలు చేశారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభన నేపథ్యంలో అధికారులు వేడుకలపై ఆంక్షలు విధించారు. 

Updated Date - 2022-01-01T03:52:35+05:30 IST