యాజమాన్యంతో చర్చలు విఫలం

ABN , First Publish Date - 2021-11-06T04:41:23+05:30 IST

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సంగారెడ్డి మండలం ఫసల్‌వాది గ్రామ సమీపంలోని గణపతి చక్కెర పరిశ్రమ కార్మికుల పన్నెండు రోజులుగా సమ్మె చేపట్టారు.

యాజమాన్యంతో చర్చలు విఫలం

సంగారెడ్డిరూరల్‌, నవంబరు 5 : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సంగారెడ్డి మండలం ఫసల్‌వాది గ్రామ సమీపంలోని గణపతి చక్కెర పరిశ్రమ కార్మికుల పన్నెండు రోజులుగా సమ్మె చేపట్టారు. పరిశ్రమ యాజమాన్యం శుక్రవారం యూనియన్‌ నాయకులతో చర్చలు జరిపారు. కార్మికుల డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో కార్మికులు సమ్మె యధాతథంగా కొనసాగిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజిరెడ్డి, రాములు, దుర్గేష్‌, శంకర్‌రెడ్డి, శివచందర్‌, నాగేందర్‌, భాస్కర్‌, రంగారెడ్డి, వెంకట్‌రెడ్డి, రాములు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-06T04:41:23+05:30 IST