పట్టణానికి ప్రకృతి సోయగం

ABN , First Publish Date - 2021-05-30T05:47:44+05:30 IST

హరితహారంలో భాగంగా పట్టణాల్లోనూ ప్రకృతివనాలను తీర్చిదిద్దుతున్నారు. మొదటి విడతలో గ్రామాలకే పరిమితమైన ప్రకృతివనాలను ఇప్పుడు పట్టణాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఏర్పాటు చేసేందుకు పట్టణ ప్రకృతి, గ్రీన్‌ బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నది.

పట్టణానికి ప్రకృతి సోయగం
మెదక్‌ జిల్లా కేంద్రం నాలుగో వార్డులో ప్రకృతివనం ముఖద్వారం

మెదక్‌ జిల్లా కేంద్రంలో నాలుగు పార్కులు   

15 వేలకుపైగా మొక్కల పెంపకం 

ఏపుగా పెరుగుతున్న మొక్కలతో ఆకర్షణీయంగా ప్రకృతివనాలు 


మెదక్‌ మున్సిపాలిటీ, మే 29: హరితహారంలో భాగంగా పట్టణాల్లోనూ ప్రకృతివనాలను తీర్చిదిద్దుతున్నారు. మొదటి విడతలో గ్రామాలకే పరిమితమైన ప్రకృతివనాలను ఇప్పుడు పట్టణాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఏర్పాటు చేసేందుకు పట్టణ ప్రకృతి, గ్రీన్‌ బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నది. జిల్లాకేంద్రమైన మెదక్‌ మున్సిపాలిటీ పరిధిలో నాలుగు పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో రెండు, కొత్త కలెక్టరేట్‌ వెనుక ఒకటి, పంప్‌హౌస్‌ వద్ద మరొకటి ఏర్పాటు చేశారు. ప్రతీపార్కులో 3వేల నుంచి 4వేల వరకు వివిధరకాల మొక్కలను పెంచుతున్నారు. మొక్కల పెంపకంపై మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, కమిషనర్‌ శ్రీహరి ప్రత్యేకశ్రద్ధ చూపుతున్నారు. పార్కులచుట్టూ ఫెన్సింగ్‌, ఆకుపచ్చని తోరణాల ప్రవేశద్వారాలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగాపెరిగి ఆకుపచ్చటి శోభను సంతరించుకున్నాయి. పార్కుల్లో ప్రత్యేకంగా వాకింగ్‌ట్రాక్‌లు, స్థానికులు సేదతీరేందుకు బెంచీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. 

Updated Date - 2021-05-30T05:47:44+05:30 IST