నూతన పంచాయతీల ఏర్పాటుతో అభివృద్ధి
ABN , First Publish Date - 2021-12-30T20:01:00+05:30 IST
ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడంతో అవి అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు.

కల్హేర్, డిసెంబరు 29 : ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడంతో అవి అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఖానాపూర్(కె) గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం రాంరెడ్డిపేట్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఖేడ్ ఆత్మకమిటీ చైర్మన్ రాంసింగ్, ఎంపీపీ గుర్రపు సుశీల, జడ్పీటీసీ నర్సింహారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ ఎండి.అలీ, ఖానాపూర్ (కె) సర్పంచ్ కవితాగోపాల్‌రెడ్డి, క్రిష్ణాపూర్ ఎంపీటీసీ గుండమ్మ అంజయ్య, సర్పంచ్ కిష్టారెడ్డి, నాయకులు ఈశ్వర్, బాల్‌రాజ్ సాగర్, శ్రీనివా్‌ససాగర్, ప్రశాంత్‌సాగర్ పాల్గొన్నారు.