ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-12-30T20:00:27+05:30 IST
ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు.

నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నారాయణఖేడ్/నాగల్‌గిద్ద/మనూరు/కంగ్టి, డిసెంబరు 29 : ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో మండలంలోని చాప్టా.కెకు చెందిన 11 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ కమిటీ సభ్యులు రవీందర్‌నాయక్, నాయకులు సంగప్ప పాల్గొన్నారు. అలాగే నాగల్‌గిద్ద మండలంలోని 57 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీపీ మోతిబాయిరాథోడ్, వైస్ ఎంపీపీ పండరియాదవ్, పార్టీ మండలాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. మనూరు మండలంలోని ఐకేపీ కార్యాలయంలో వివిధ గ్రామాలకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఎంపీపీ కొంగరి జయశ్రీమోహన్‌రెడ్డి, జడ్పీటీసీ పుష్పబాయి, సర్పంచ్ శివాజీరావు, రాజేంద్రరావు, నర్సింహులు, తహసీల్దార్ మురళీ పాల్గొన్నారు. అలాగే కంగ్టి మండల పరిధిలోని జమ్గి.కె శివారులో ఏర్పాటుచేసిన హెచ్‌పీ పెట్రోల్ పంపును బుధవారం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సిద్ధుపాటిల్, టీఆర్‌ఎస్ మాజీ మండలాధ్యక్షుడు సంతో్‌షపాటిల్, రైతుబంధు కో ఆర్డినేటర్ ఆంజనేయులు, పార్టీ అధ్యక్షుడు గంగారాం పాల్గొన్నారు.