రూఫ్‌ గార్డెనింగ్‌కు మున్సిపాలిటీ సహకారం

ABN , First Publish Date - 2021-02-06T04:50:09+05:30 IST

నివాసాల మిద్దెలపై కూరగాయల సాగు విధానానికి మున్సిపాలిటీ తరపున సహకారాన్ని అందిస్తామని చైర్‌పర్సన్‌ రోజారాణి అన్నారు.

రూఫ్‌ గార్డెనింగ్‌కు మున్సిపాలిటీ సహకారం
మిద్దెపై సాగు చేస్తున్న కూరగాయలను పరిశీలిస్తున్న చైర్‌పర్సన్‌, కమిషనర్‌

బొల్లారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రోజారాణి

 జిన్నారం, ఫిబ్రవరి 5:  నివాసాల మిద్దెలపై కూరగాయల సాగు విధానానికి మున్సిపాలిటీ తరపున సహకారాన్ని అందిస్తామని చైర్‌పర్సన్‌ రోజారాణి అన్నారు. శుక్రవారం బొల్లారం మున్సిపాలిటీ 18వ వార్డులో సత్యరెడ్డి, కవిత దంపతులు తమ ఇంటి మిద్దె (రూఫ్‌గార్డెన్‌)పై సాగు చేస్తున్న కూరగాయల పంటలను చైర్‌పర్సన్‌ రోజారాణి, కమిషనర్‌ రాజేంద్రబాబు, మున్సిపల్‌ అధికారులు కిరణ్‌రెడ్డి, వినోద్‌ పరిశీలించారు. నివాస భవనం పై భారీ ఎత్తున చేపట్టిన కూరగాయల సాగును ఆసక్తిగా పరిశీలించి, ఇతరులకు ఆదర్శంగా నిలిచారని సత్యరెడ్డి, కవిత దంపతులను రోజారాణి అభినందించారు.   

Updated Date - 2021-02-06T04:50:09+05:30 IST