ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీ: ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2022-01-01T04:23:29+05:30 IST

బైక్‌ను ఆర్టీసీబస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీ: ఇద్దరికి గాయాలు

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), డిసెంబరు 31: బైక్‌ను ఆర్టీసీబస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మనోహరాబాద్‌ మండలంలోని కూచారం చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ్వంపేట మండలం ఉసిరికపల్లికి చెందిన శ్రీకాంత్‌, విజయ్‌ మేడ్చల్‌ వైపు నుంచి తూప్రాన్‌ వైపునకు బైక్‌పై హైవే 44 మీదుగా బయలుదేరారు. వారు మనోహరాబాద్‌ మండలంలోని కూచారం చౌరస్తా వద్దకు చేరుకోగానే నిజామాబాద్‌ డిపోకు చెందిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ బస్సు బైక్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.  ఈ ఘటనలో బైక్‌పై నుంచి కింద పడిన శ్రీకాంత్‌, విజయ్‌లకు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయారు. క్షతగాత్రులిద్దరిని హైవే అంబులెన్సులో తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇరువురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలిసింది.  

Updated Date - 2022-01-01T04:23:29+05:30 IST