సిరసనగండ్ల సర్పంచ్‌కు ఆగని బెదిరింపులు

ABN , First Publish Date - 2021-12-19T05:47:35+05:30 IST

కొండపాక మండలం సిరిసనగండ్ల గ్రామ సర్పంచ్‌ గూడెపు లక్ష్మారెడ్డికి శనివారం వాట్సా్‌పలో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జగన్‌ పేరిట బెదిరింపు లేఖ వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి డివిజన్‌ కమిటీ పేరిట రాసిన లేఖను లక్ష్మారెడ్డికి వాట్సా్‌పలో పంపించారు. సర్పంచ్‌కు శుక్రవారం కూడా మావోయిస్టు జగన్‌ పేరిట ఫోన్‌ కాల్‌ రావడంతో త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సిరసనగండ్ల సర్పంచ్‌కు ఆగని బెదిరింపులు
వాట్సాప్‌లో వచ్చిన లేఖను చూపుతున్న సర్పంచ్‌ లక్ష్మారెడ్డి

మావోయిస్టు జగన్‌ పేరిట వాట్సాప్‌లో లేఖ

భద్రత కల్పించాలని సర్పంచ్‌ వేడుకోలు


కొండపాక, డిసెంబరు 18: కొండపాక మండలం సిరిసనగండ్ల గ్రామ సర్పంచ్‌ గూడెపు లక్ష్మారెడ్డికి శనివారం వాట్సా్‌పలో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జగన్‌ పేరిట బెదిరింపు లేఖ వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి డివిజన్‌ కమిటీ పేరిట రాసిన లేఖను లక్ష్మారెడ్డికి వాట్సా్‌పలో పంపించారు. సర్పంచ్‌కు శుక్రవారం కూడా మావోయిస్టు  జగన్‌ పేరిట ఫోన్‌ కాల్‌ రావడంతో త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం మరోసారి లేఖ రావడం కలకలం రేపింది. ఈ వివరాలను లక్ష్మారెడ్డి విలేకరులకు వెల్లడించారు. లేఖలో పార్టీ ఫండ్‌ ఇవ్వాలని, పార్టీకి అనుకూలంగా ఉంటే పార్టీ కూడా తనకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. మంచికి.. మంచి, చెడుకు.. చెడు ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ గురించి తెలుసు కాబట్టి ఎంత ఇవ్వగలవో చెప్పాలని సూచించారు. లేఖ రాసింది ఎవరో తేల్చాలని, తనకు రక్షణ కల్పించాలని లక్ష్మారెడ్డి పోలీసులను కోరారు.

Updated Date - 2021-12-19T05:47:35+05:30 IST