రైతుల ఆధార్‌కు మొబైల్‌ నంబర్‌ లింక్‌ తప్పనిసరి

ABN , First Publish Date - 2021-11-24T04:53:41+05:30 IST

ధాన్యం విక్రయించే రైతులు తమ ఆధార్‌కు మొబైల్‌ నంబరును తప్పనిసరిగా లింక్‌ చేసుకోవాలని జిల్లా సహకార అధికారి జి.చంద్రమోహన్‌రెడ్డి సూచించారు.

రైతుల ఆధార్‌కు మొబైల్‌ నంబర్‌ లింక్‌ తప్పనిసరి

 గజ్వేల్‌, నవంబరు 23: ధాన్యం విక్రయించే రైతులు తమ ఆధార్‌కు మొబైల్‌ నంబరును తప్పనిసరిగా లింక్‌ చేసుకోవాలని జిల్లా సహకార అధికారి జి.చంద్రమోహన్‌రెడ్డి సూచించారు. గజ్వేల్‌ మండల పరిధిలోని బూర్గుపల్లి, ధర్మారెడ్డిపల్లి, బయ్యారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఫోన్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారానే ధాన్యం తూకం వేసిన వివరాలు నమోదవుతాయని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా జిల్లా వ్యాప్తంగా రైస్‌ మిల్లర్లు సహకరించాలని సూచించారు. ప్రతీ రైస్‌మిల్లుకు ఓ ప్రత్యేకాధికారిని నియమించామని తూకం వేసిన వెంటనే ధాన్యం అన్‌లోడింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆయనవెంట పీఎసీఎస్‌ సీఈవో బాలయ్య ఉన్నారు.


 

Updated Date - 2021-11-24T04:53:41+05:30 IST