మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు
ABN , First Publish Date - 2021-12-31T17:03:52+05:30 IST
మద్యం సేవించి వాహనాలను నడిపితే కేసులు నమోదు చేస్తామని మిరుదొడ్డి ఎస్‌ఐ శ్రీనివాస్ హెచ్చరించారు.

మిరుదొడ్డి, డిసెంబరు 30: మద్యం సేవించి వాహనాలను నడిపితే కేసులు నమోదు చేస్తామని మిరుదొడ్డి ఎస్‌ఐ శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం మిరుదొడ్డిలో ఆయన మాట్లాడారు. ఎవరైనా రాత్రివేళల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే సీపీ ఆదేశాల మేరకు కఠిన చర్యలను తీసుకోవడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కాగా డీజే బాక్స్‌లకు అనుమతి లేదన్నారు.