గోదావరి జలాలతో దుబ్బాక అద్భుతంగా అభివృద్ధి: హరీష్

ABN , First Publish Date - 2021-08-20T19:30:02+05:30 IST

గోదావరి జిల్లాలతో దుబ్బాక అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి హరీష్ ‌రావు అన్నారు.

గోదావరి జలాలతో దుబ్బాక అద్భుతంగా అభివృద్ధి: హరీష్

సిద్దిపేట: గోదావరి జిల్లాలతో దుబ్బాక అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి హరీష్ ‌రావు అన్నారు. శుక్రవారం దుబ్బాకలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ బాలాజీ ఆలయంలో  మూల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ గతంలో దేవాలయానికి సంబంధించిన నిధులు ప్రభుత్వాలు వాడుకునేవారని.. ఇప్పుడు ప్రభుత్వమే దేవాలయాలకు ఖర్చు చేస్తుందని తెలిపారు. చిన్న జీయర్ స్వామి ఆశీస్సులుతో తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తోందన్నారు. గతంలో ఆత్మహత్యలకు నిలయంగా దుబ్బాక  ఉండేదని... ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలతో కనిపిస్తోందని మంత్రి హరీష్ ‌రావు పేర్కొన్నారు. ఈరోజు ఉదయం బాలాజీ ఆలయంలో  శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి  ప్రత్యేక పూజలు, హోమాల అనంతరం స్వామి వారి మూల విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొంటారు. 


Updated Date - 2021-08-20T19:30:02+05:30 IST