ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ABN , First Publish Date - 2021-12-25T05:30:00+05:30 IST

జహీరాబాద్‌ నియోజకవర్గంలోని జహీరాబాద్‌ టౌన్‌, కోహీర్‌, జహీరాబాద్‌, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్‌కల్‌ మండలాల్లో శనివారం క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకున్నారు.

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు
జహీరాబాద్‌లోని మెథడిస్ట్‌ సెంట్రల్‌ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్‌ ఆరాధనలో పాల్గొన్న ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు

భక్తిశ్రద్ధలతో క్రైస్తవుల కీర్తనలు, ప్రార్థనలు 

అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు 

జహీరాబాద్‌, డిసెంబరు 25 : జహీరాబాద్‌ నియోజకవర్గంలోని జహీరాబాద్‌ టౌన్‌, కోహీర్‌, జహీరాబాద్‌, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్‌కల్‌ మండలాల్లో శనివారం క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకున్నారు. జహీరాబాద్‌లోని మెథడిస్ట్‌ సెంట్రల్‌ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్‌ ఆరాధనలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేను క్రైస్తవ సోదరులతో పాటు సంఘ కాపరులు శాలువా, పూలమాలతో సన్మానించారు. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.

రామచంద్రాపురం: రామచంద్రాపురం పట్టణం, తెల్లాపూర్‌ మున్సిపాలిటీలో శనివారం క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవ సోదరులు నిర్వహించారు. పాస్టర్‌ ఎర్రొళ్ల దేవేందర్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు వి.సింధూఆదర్శరెడ్డి, బి.పుష్పనగేష్‌ పాల్గొన్నారు. మెథడిస్ట్‌ చర్చిలో జరిగిన రెండు ఆరాధనల్లో పాస్టర్లు చంద్రయ్య, లక్ష్మణ్‌ క్రీస్తు జన్మ విధానాన్ని వివరించారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, కాంగ్రెస్‌ నాయకులు శ్రీనివా్‌సగౌడ్‌ అందించిన కేక్‌ కట్‌చేశారు.

సంగారెడ్డి అర్బన్‌: సంగారెడ్డిలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ హాజరై కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు భీమ్‌ సోల్జర్స్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్పనూరి శేఖర్‌ కేక్‌ తినిపించి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

జిన్నారం: జిన్నారం, బొల్లారంలోని వివిధ చర్చిల్లో శనివారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రోజారాణి, కౌన్సిలర్‌ చంద్రారెడ్డి, హన్మంతరెడ్డి, మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి పాల్గొన్నారు. 

పుల్‌కల్‌: చౌటకూర్‌ మండలం గంగోజిపేట, పుల్కల్‌ మండలంలోని బస్వాపూర్‌ గ్రామాల్లో క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్‌ నాయకులు పేద మహిళలకు క్రిస్మస్‌ కానుకలను అందజేశారు. టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు బేగరి విష్ణయ్య, ఎస్సీ విభాగం మండలాధ్యక్షుడు కాశపాగ ఇమ్మయ్య, గ్రామ అధ్యక్షుడు గంగాధరి ప్రసాద్‌, వార్డుసభ్యుడు నీరుడి కుమార్‌ పాల్గొన్నారు. అలాగే ఉమ్మడి పుల్కల్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలు జరిగాయి. 

మునిపల్లి: మండల కేంద్రంలో ఎంపీపీ గైడిగామ శైలజాశివకుమార్‌, పార్టీ మండలాధ్యక్షుడు వారణాసి సతీ్‌షకుమార్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు సాయికుమార్‌ ఆధ్వర్యంలో గ్రామాల్లోని అన్ని చర్చిలకు క్రిస్మస్‌ కేక్‌లను పంపిణీ చేశారు. సర్పంచ్‌ రమే్‌ష, నవాజ్‌రెడ్డి, ఆనంద్‌ పాల్గొన్నారు. 

వట్‌పల్లి: వట్‌పల్లి మండలంలోని నాగులపల్లిలో టీఆర్‌ఎస్‌ నాయకుడు రాజేశ్వర్‌గౌడ్‌ పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని చర్చిలో కేక్‌ కట్‌చేసి సంబురాలు జరుపుకున్నారు. 

నారాయణఖేడ్‌: ఖేడ్‌ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ సురేష్‌ కుమార్‌ షెట్కార్‌ పాల్గొని కేక్‌ను కట్‌ చేశారు. పాస్టర్లు ఆయనను శాలువాతో సన్మానించారు. ఖేడ్‌లోని కేవీపీఎస్‌, సీఐటీయూ కార్యాలయంలో క్రిస్మస్‌ వేడుకలను నిర్వహించారు. 

నాగల్‌గిద్ద/హత్నూర: నాగల్‌గిద్దతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలను ఆయా చర్చిల్లో జరుపుకున్నారు. హత్నూర మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలను జరుపుకున్నారు. 

ఝరాసంగం: ఝరాసంగంతో పాటు మండల పరిధిలోని మాచూనూర్‌, బర్దీపూర్‌, ఏడాకులపల్లి, జీర్లపల్లి, పోట్‌పల్లి తదితర గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

రాయికోడ్‌: రాష్ట్రం ఏర్పడిన తర్వాత పండుగలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్‌పాటిల్‌, పార్టీ మండలాధ్యక్షుడు బస్వరాజ్‌పాటిల్‌ అన్నారు. శనివారం రాయికోడ్‌ మండలంలోని ఆయా గ్రామాల క్రిస్టియన్‌ సోదరులకు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ పంపిన కేక్‌లను టీఆర్‌ఎస్‌ నాయకులు పంపిణీ చేశారు. 

మెదక్‌ జిల్లాలో

హవేళీఘణపూర్‌, డిసెంబరు 25 : కరుణామయుడు యేసు చూపించిన శాంతి మార్గంలో ప్రజలు నడవాలని సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి సూచించారు. మండల పరిధిలోని బూర్గుపల్లి చర్చిలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌చేసి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. చర్చి అభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీఇచ్చారు. ఎంపీటీసీ చిట్యాల అర్చనాశ్రీనివాస్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, సర్పంచులు యామిరెడ్డి, దేవాగౌడ్‌, సవితాశ్రీకాంత్‌, శ్రీనునాయక్‌ పాల్గొన్నారు. 

మెదక్‌: మెదక్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. కేక్‌ కట్‌చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ బట్టి జగపతి, కౌన్సిలర్లు కొట్టాల విశ్వం, శ్రీనివాస్‌, వసంత్‌రాజ్‌, జయరాజ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గంగాధర్‌, కృష్ణాగౌడ్‌ పాల్గొన్నారు. 

నర్సాపూర్‌: నర్సాపూర్‌లోని స్థానిక సీఎ్‌సఐ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌, కౌన్సిలర్‌ రాంచందర్‌, ఏఎంసీ డైరెక్టర్‌ సాగర్‌, మాజీ ఎంపీటీసీ నగేష్‌ పాల్గొన్నారు. చర్చి ఫాదర్‌ హామ్‌స్ర్టాంగ్‌తో కలిసి కేక్‌ కట్‌చేసి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేటలోని సీఎ్‌సఐ చర్చితో పాటు మండల పరిధిలోని ఆయా చర్చిల్లో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. టెంకటి సర్పంచ్‌ సుధాకర్‌, టెంకటి సాయిలు, పేట సీఎ్‌సఐ చర్చి బాధ్యులు, పాస్టర్‌ దేవవరం, చార్లెస్‌ వాకర్‌ పద్మారావు, ఆల్ర్పేడ్‌ రాజ్‌, భూమయ్య పాల్గొన్నారు. 

రేగోడు: అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ క్రిస్మస్‌ సందర్భంగా అందించిన కేక్‌లను చర్చిల నిర్వాహకులకు టీఆర్‌ఎస్‌ నాయకులు పంపిణీ చేశారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజు యాదవ్‌, సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రవీందర్‌ పాల్గొన్నారు. రేగోడుతో పాటు ఆయా గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలను జరుపుకున్నారు. 

అల్లాదుర్గం: అల్లాదుర్గం మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని చేవెళ్ల గ్రామంలో మాజీ ఎంపీపీ కాశీనాథ్‌ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు జరుపుకున్నారు. 

తూప్రాన్‌: తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాల్లో శనివారం క్రిస్మస్‌ వేడుకలు జరుపుకున్నారు. తూప్రాన్‌ పట్టణంలోని సీఎ్‌సఐ, కేథలిక్‌, పెంథకోస్టు, పోతరాజుపల్లిలోని పెంథకోస్టు ఫిలదెల్పియా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో కౌన్సిలర్‌ జిన్న భగవాన్‌రెడ్డి పాల్గొని కేక్‌ కట్‌చేశారు. మనోహరాబాద్‌ మండలంలోని సెంట్‌ ఫీటర్‌, సీఎ్‌సఐ చర్చిల్లో క్రిస్మస్‌ వేడుకలు జరుపుకున్నారు. సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చిట్కుల్‌ మహిపాల్‌రెడ్డి హాజరయ్యారు. కాళ్లకల్‌లో పాస్టర్‌ మోజస్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు.  

తూప్రాన్‌రూరల్‌: తూప్రాన్‌ మండలంలో క్రైస్తవులు శనివారం క్రిస్మస్‌ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇమాంపూర్‌, ఇస్లాంపూర్‌, ఘనపూర్‌లోని చర్చిలు భజనలతో మార్మోగాయి. 

చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలంలో క్రిస్మస్‌ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు జంగరాయి, చందాపూర్‌, అంబాజీపేట, కొరివిపల్లి, ఖాజాపూర్‌ తదితర గ్రామాల్లో క్రైస్తవులు కొవ్వొత్తులు పట్టుకుని వీధుల్లో శిలువను ఊరేగించారు. ఈ వేడుకలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. Updated Date - 2021-12-25T05:30:00+05:30 IST