హెల్త్‌ సబ్‌సెంటర్‌తో వైద్య సేవలు

ABN , First Publish Date - 2022-01-01T04:23:00+05:30 IST

ప్రభుత్వం మండలానికో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటు చేస్తున్న క్రమంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి తెలిపారు.

హెల్త్‌ సబ్‌సెంటర్‌తో వైద్య సేవలు

 మద్దూరు, డిసెంబరు 31: ప్రభుత్వం మండలానికో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటు చేస్తున్న క్రమంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం దూళిమిట్టలో సర్పంచ్‌ దుబ్బుడు దీపికావేణుగోపాల్‌రెడ్డితో కలిసి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం సర్పంచ్‌తో కలిసి మాట్లాడారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధులు రూ.16 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్ర భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉపకేంద్రంలో ఎల్లప్పుడూ వైద్యాధికారితో పాటు సిబ్బంది గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. కార్యక్రమంటో ఉపసర్పంచ్‌ లింగం, సెక్రటరీ అనిత, డైరెక్టర్‌ కృష్ణ, మాజీ సర్పంచ్‌ సీతారామారావు, మాజీ ఎంపీటీసీ విజయ్‌కుమార్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు భాస్కర్‌, మాజీ ఉపసర్పంచ్‌ కనకయ్య, శ్రీను, బడుగు సాయిలు, ఏఎన్‌ఎం స్వరూప తదితరులు పాల్గొన్నారు.


 


Updated Date - 2022-01-01T04:23:00+05:30 IST