Medak: వైఎస్ షర్మిల నిరాహార దీక్ష
ABN , First Publish Date - 2021-12-11T19:55:21+05:30 IST
జిల్లాలోని హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్‌లో వైఎస్సార్టీపీ అధినేత్ర షర్మిల దీక్ష చేపట్టారు.
మెదక్: జిల్లాలోని హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్‌లో వైఎస్సార్టీపీ అధినేత్ర షర్మిల దీక్ష చేపట్టారు. రైతు రవికుమార్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ దీక్షకు దిగారు. ప్రభుత్వ తీరుతో రైతు రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రభుత్వం స్పందించే వరకు నిరాహార దీక్ష చేపడుతానని షర్మిల స్పష్టం చేశారు. దీంతో షర్మిల అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు.