రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చర్యలు : డీఎస్పీ
ABN , First Publish Date - 2021-12-30T20:01:44+05:30 IST
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు.

అల్లాదుర్గం, డిసెంబరు 29 : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు. బుధవారం అల్లాదుర్గం పోలీ్‌సస్టేషన్‌ను సందర్శించి నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అల్లాదుర్గం పోలీ్‌సస్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఈ ప్రమాదాలు నిబంధనలు పాటించకపోవడం, వాహనదారులు రాంగ్‌రూట్‌లో రావడంతోనే సంభవిస్తున్నాయన్నారు. ఒమైక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పనితీరు భేష్‌గా ఉన్నదన్నారు. ఈ సందర్భంగా అల్లాదుర్గం సీఐ జార్జీ, ఎస్‌ఐ మోహన్‌రెడ్డిని అభినందించారు.