ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-30T04:21:39+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీష్‌ సూచించారు.

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

బ్లాక్‌ స్పాట్‌ ప్రాంతాల్లో స్పీడ్‌ బ్రేకర్లు

సమీక్షలో జిల్లా కలెక్టర్‌ హరీష్‌

మెదక్‌ అర్బన్‌, అక్టోబరు29: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీష్‌ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రోడ్డు భద్రత కమిటీతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ... జిల్లాలో బ్లాక్‌ స్పాట్‌ ప్రాంతాల్లో స్పీడ్‌ బ్రేకర్లు, స్టడ్స్‌, బ్లింకర్‌ లైట్లు, కల్వర్టులు, అండర్‌ పాస్‌ వద్ద రేడియం స్టిక్కర్లు, టీ ఎండ్‌ గల రోడ్డు ప్రాంతాల్లో సైన్‌ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా జంక్షన్లు, యూటర్న్‌లు, పాదచారులు రోడ్డు దాటేటప్పుడు, వేగంగా వెళ్లడం, రాంగ్‌రూట్‌లో డ్రైవ్‌ చేయడం, చిన్న, పెద్ద రోడ్ల్లు కలిసే ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ప్రమాదంలో మృతి చెందిన సంఖ్యను ఆధారంగా ఏ,బీ,సీ కేటగిరిలుగా బ్లాక్‌ స్పాట్లను గుర్తించామని, అందుకనుగుణంగా అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. తూప్రాన్‌ జాతీయ రహదారుల వెంట రోడ్డు భదత్ర నిబంధనలను ఉల్లంఘించిన దాబాలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నర్పాపూర్‌లోని ప్రధాన రహదారుల్లో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉన్నందున రోడ్డు భద్రతా మార్గదర్శకాల ప్రకారం అన్ని చర్యలు చేపట్టాలన్నారు. వడియారం జంక్షన్‌ వద్ద అండర్‌ పాస్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. చేగుంట గోల్డెన్‌ దాబా దగ్గర బ్లాక్‌ స్పాట్‌ పనులను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T04:21:39+05:30 IST