ఐఐటీహెచ్‌లో మార్చి 21 టెడెక్స్ టాక్ షో
ABN , First Publish Date - 2021-03-18T05:03:37+05:30 IST
సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌లో మార్చి 21 ఆదివారం టెడెక్స్ టాక్‌షో కార్యక్రమాన్ని ఆన్‌లైన్ వేదికగా నిర్వహించనున్నారు.
కంది, మార్చి 17 : సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌లో మార్చి 21 ఆదివారం టెడెక్స్ టాక్‌షో కార్యక్రమాన్ని ఆన్‌లైన్ వేదికగా నిర్వహించనున్నారు. విద్యార్థులు కొత్తగా ఆలోచించే విధానంపై పలువురు వక్తలు తమ అనుభవాలను పంచుకోనున్నారు. ఐఐటీహెచ్ అధికారులు బుధవారం టాక్ షోకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. సమాజంలో వ్యక్తులు పరిశోధకులుగా ఎంత ఉన్నత స్థానం చేరుకోగలరో ఈ ఆన్‌లైన్ చర్చల ద్వారా తెలుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. భవిష్యత్‌లో విద్యావిధానంలో విద్యార్థుల దృక్పథంపై చర్చలు ఉంటాయని, టెడెక్స్ టాక్ షోకు పేరు రిజిస్టర్ చేసుకోవడానికి, మరిన్ని వివరాలకు ఐఐటీహెచ్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఈవెంట్ నిర్వాహకులు పేర్కొన్నారు.