ఉపాధిహమీ పనుల్లో అవకతవకలు

ABN , First Publish Date - 2021-11-03T04:38:36+05:30 IST

మండల వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల్లో జరిగిన ఉపాధిహామీ పనుల్లో రూ. 3,44,000 అవకతవకలు జరిగినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌ తెలిపారు.

ఉపాధిహమీ పనుల్లో అవకతవకలు

వెల్దుర్తి, నవంబరు 2: మండల వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల్లో జరిగిన ఉపాధిహామీ పనుల్లో రూ. 3,44,000 అవకతవకలు జరిగినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం రాత్రి వరకు వెల్దుర్తి మండల మహత్మాగాంధీ ఉపాధి పథకం పనులకు సంబంధించి 12వ సామాజిక తనిఖీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పీడీ మాట్లాడుతూ వారం రోజులుగా తమ సిబ్బంది గ్రామాల్లో ఉపాధిహామీ పనులపై ఆడిట్‌ నిర్వహించగా ప్రతీ గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, ఇతర పనుల్లో రూ.5 వేల చొప్పున అవకతవకలు జరిగినట్లు నివేదికలో తేలినట్లు తెలిపారు. ఈ డబ్బును గ్రామపంచాయతీల నుంచి రికవరీ చేస్తామన్నారు. 

Updated Date - 2021-11-03T04:38:36+05:30 IST