కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

ABN , First Publish Date - 2021-09-02T05:30:00+05:30 IST

మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులో హైవే 44పై గురువారం రాత్రి కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), సెప్టెంబరు 2: మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులో హైవే 44పై గురువారం రాత్రి కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.  మనోహరాబాద్‌ ఎస్‌ఐ రాజుగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్‌కు చెందిన గురుమూర్తి, శోభారాణి దంపతులు మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లి వద్ద నివాసముంటున్నారు. శోభారాణి ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా, కంపెనీ క్వార్టర్లలో ఉంటున్నారు. గురువారం రాత్రి గురుమూర్తి (50) రోడ్డు పక్కనున్న దుకాణం నుంచి ఇంటికి పాలు తీసుకెళ్తుండగా తూప్రాన్‌వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే దుర్మరణంపాలయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తూప్రాన్‌ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ వివరించారు.  

Updated Date - 2021-09-02T05:30:00+05:30 IST