రామాయంపేటలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-01T04:20:48+05:30 IST

రామాయంపేటకు చెందిన ఓ వ్యక్తి మానసిక ఒత్తిడికి లోనై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రామాయంపేటలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

రామాయంపేట, డిసెంబరు 31: రామాయంపేటకు చెందిన ఓ వ్యక్తి మానసిక ఒత్తిడికి లోనై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం బైపాస్‌ రోడ్డుకు సమీపంలో జరిగింది. ఎస్‌ఐ రాజేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రామాయం పేటకు చెందిన మెట్టు శ్రీనివాస్‌(43) కొత్త ఇంటి నిర్మాణం తలపెట్టాడు. అతడికి ఆర్థికపరంగా పెద్ద ఇబ్బందులేమీ లేనప్పటికీ  కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించి పక్షం రోజులుగా తనలో తనే కలత చెందేవాడు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీనివాస్‌ భోజనానికి రాకపోవడంతో భార్య లక్ష్మి తన బంధువులకు తెలిపింది. వారందరూ కలిసి చుట్టుపక్కల వెతకగా బైపాస్‌ రోడ్డుకు అనుకొని ఉన్న ఓ చెట్టుకు వేలాడుతున్న శ్రీనివాస్‌ మృతదేహం కనిపించింది. వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలుపగా వెంటనే ఎస్‌ఐ రాజేష్‌ ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం  కుటుంబీకులకు అప్పగించారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.  

Updated Date - 2022-01-01T04:20:48+05:30 IST