నేడు మల్లన్న ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2021-05-20T06:38:30+05:30 IST
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ పాలకమండలి సభ్యులతో నేడు మల్లన్న ఆలయంలో ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు ఈవో బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

చేర్యాల, మే 19 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ పాలకమండలి సభ్యులతో నేడు మల్లన్న ఆలయంలో ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు ఈవో బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలిసిన గీస భిక్షపతి
మల్లన్న ఆలయ పాలకమండలిలో చోటు కల్పించడం పట్ల కొమురవెల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి బుధవారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మల్లన్న భక్తుల మనోభీష్టం మేరకు చిత్తశుద్ధితో పనిచేసి ఆలయాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే ఆయనకు సూచించారు. ఆయన వెంట కొమురవెల్లి జడ్పీటీసీ సిలివేరి సిద్ధప్ప, టీఆర్‌ఎస్ నాయకుడు తలారి కిషన్ ఉన్నారు.