భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

ABN , First Publish Date - 2021-08-11T05:12:44+05:30 IST

బాణామతి చేస్తున్నదనే అనుమానంతో కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రఽధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి మంగళవారం తీర్పు చెప్పారు

భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

సంగారెడ్డి క్రైం, ఆగస్టు 10: బాణామతి చేస్తున్నదనే అనుమానంతో కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రఽధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి మంగళవారం  తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే... సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం అనంతసాగర్‌ గ్రామానికి చెందిన మంగలి ఆంజనేయులు గత జూన్‌ 25న ఇంట్లో పడుకున్న భార్య అమృతను గొంతు నులిమి హత్య చేశాడు. దీంతో అప్పటి ఎస్‌ఐ బాలస్వామి కేసు నమోదు చేయగా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రఘు దర్యాప్తు చేశారు. కోర్టులో ప్రాసిక్యూషన్‌ తరపున శ్రీనివా్‌సరెడ్డి వాదనలు వినిపించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో నేరస్థుడు ఆంజనేయులుకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.5000 జరిమానా విధిస్తూ ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రఽధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి  తీర్పు చెప్పారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేవిధంగా కృషి చేసిన కోర్టు కానిస్టేబుళ్లు ఎం.నర్సయ్య, రమే్‌షలను సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ అభినందించారు.  

Updated Date - 2021-08-11T05:12:44+05:30 IST