జయశంకర్‌ సార్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం

ABN , First Publish Date - 2021-06-22T05:02:10+05:30 IST

జయశంకర్‌ సార్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దామని టీపీటీఎఫ్‌ అసోసియేట్‌ జిల్లా అధ్యక్షుడు బి.రాజు అన్నారు.

జయశంకర్‌ సార్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం
గజ్వేల్‌లో జయశంకర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

టీపీటీఎఫ్‌ అసోసియేట్‌ జిల్లా అధ్యక్షుడు రాజు

గజ్వేల్‌/సిద్దిపేట ఎడ్యుకేషన్‌, జూన్‌ 21 : జయశంకర్‌ సార్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దామని టీపీటీఎఫ్‌ అసోసియేట్‌ జిల్లా అధ్యక్షుడు బి.రాజు అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని టీపీటీఎఫ్‌ కార్యాలయంలో సోమవారం జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీపీటీఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాంచంద్రంతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన వెంట జోన్‌ కన్వీనర్‌ మల్లికార్జున్‌ తదితరులున్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ పదవ వర్ధంతి సందర్భంగా సోమవారం సిద్దిపేటలోని ముస్తాబాద్‌ చౌరస్తాలో ఆయన విగ్రహానికి టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.తిరుపతిరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.విజేందర్‌ రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్‌ గోపాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కె.తిరుపతి, జానకిరాములు, పి.జనార్ధన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు ఆర్‌.పద్మయ్య, ఎ.సత్యనారాయణ, జి.శివాజి, నాయకులు పాల్గొన్నారు. అలాగే స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జయశంకర్‌ సార్‌ వర్ధంతిని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సిహెచ్‌.ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ రాములు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.హుస్సేన్‌, అయోధ్యరెడ్డి, గోపాల సుదర్శనం పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T05:02:10+05:30 IST