వర్షపు నీటిని ఒడిసి పట్టుకుందాం

ABN , First Publish Date - 2021-03-23T04:35:29+05:30 IST

వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని పొదుపుగా వాడాలని మెదక్‌ కలెక్టర్‌ హరీష్‌ పేర్కొన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సోమవారం వాన నీటి సంరక్షణకు జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ విరిట్యువల్‌ పద్ధతిలో ప్రారంభించారు.

వర్షపు నీటిని ఒడిసి పట్టుకుందాం

కలెక్టర్‌ హరీష్‌


మెదక్‌ రూరల్‌, మార్చి 22: వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని పొదుపుగా వాడాలని మెదక్‌ కలెక్టర్‌ హరీష్‌ పేర్కొన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సోమవారం వాన నీటి సంరక్షణకు జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ విరిట్యువల్‌  పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం కేంద్రం పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యం పరిచేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. మార్చి 22 నుంచి నవంబరు 30 వరకు వాననీటిని సంరక్షించుకుని భూగర్భ జలాలను పెంపొందించుకునే విధంగా చెక్‌డ్యాంలు, కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. కాలువల్లో చెత్తాచెదారం తొలగించుట, చెరువుల పూడికతీత, పునరుద్ధరణ, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించుట వంటి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ఆ దిశగా   ఉపాధి హామీ పథకం నిర్దేశించిన పనులు చేపట్టాలని డీఆర్‌డీవో, పంచాయతీ రాజ్‌శాఖ అధికారులను కలెక్టర్‌  ఆదేశించారు. వీడియో కాన్పరెన్స్‌లో డీఆర్‌డీవో శ్రీనివాస్‌, పీఆర్‌ ఈఈ రాంచంద్రారెడ్డి, డీపీవో తరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-23T04:35:29+05:30 IST