మాయమాటలు చెప్పి మైనర్‌తో వివాహం

ABN , First Publish Date - 2021-01-12T05:44:05+05:30 IST

సిద్దిపేటక్రైం, జనవరి 11 : సిద్దిపేటకు చెందిన మైనర్‌ను వివేకానందకాలనీకి చెందిన వల్లెపు మహేష్‌ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి గతేడాది నవంబరు 10న దుద్దెడ ఎల్లమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాడు.

మాయమాటలు చెప్పి మైనర్‌తో వివాహం

సిద్దిపేటక్రైం, జనవరి 11 : సిద్దిపేటకు చెందిన మైనర్‌ను వివేకానందకాలనీకి చెందిన   వల్లెపు మహేష్‌ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి గతేడాది నవంబరు 10న దుద్దెడ ఎల్లమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని సంసారం పెట్టారు. బాలిక ఈనెల 8న బెంగతో తన తల్లిదండ్రులను చూడటానికి ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు ఆరా తీయడంతో అసలు విషయం చెప్పింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టూటౌన్‌ పోలీసులు మహేష్‌పై కిడ్నాప్‌ కేసు, నిర్భయ కేసు నమోదు చేసి జ్యూడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2021-01-12T05:44:05+05:30 IST