‘మల్లన్న’ రైల్వేస్టేషన్‌ ఏర్పాటుపై స్పష్టత కరువు

ABN , First Publish Date - 2022-01-01T03:48:58+05:30 IST

కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ కొమురవెల్లి మీదుగా వెళ్తున్న నేపథ్యంలో మల్లన్న పేరిట స్థానికంగా రైల్వేస్టేషన్‌ ఏర్పాటు చేయాలని ఈప్రాంత ప్రజలు, భక్తులు కోరుతున్నారు.

‘మల్లన్న’ రైల్వేస్టేషన్‌ ఏర్పాటుపై స్పష్టత కరువు
కొమురవెల్లి శివారులో కొనసాగుతున్న రైల్వేలైన్‌ పనులు

కొమురవెల్లి మీదుగా కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వేలైన్‌

స్థానికంగా రైల్వేస్టేషన్‌ ఏర్పాటు చేయాలని స్థానికుల ఒత్తిడి


చేర్యాల, డిసెంబరు31: కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ కొమురవెల్లి మీదుగా వెళ్తున్న నేపథ్యంలో మల్లన్న పేరిట స్థానికంగా రైల్వేస్టేషన్‌ ఏర్పాటు చేయాలని ఈప్రాంత ప్రజలు, భక్తులు కోరుతున్నారు. మల్లన్న ఆలయాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్‌ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. మొదటిదశలో కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ వరకు కొన్నినెలల క్రితం రైల్వేలైన్‌ పూర్తిచేశారు. రైల్వేలైన్‌ రెండోదశలో భాగంగా అయినాపూర్‌, కొమురవెల్లి, గౌరాయపల్లి శివారు మీదుగా లైన్‌ నిర్మిస్తుండటంతో కొమురవెల్లిలో రైల్వేస్టేషన్‌ ఏర్పాటుచేయాలని ప్రజలు విన్నవిస్తున్నారు


స్టేషన్ల ప్రతిపాదనల్లో చోటులేని కొమురవె ల్లి 

రైల్వేలైన్‌లో భాగంగా కొమురవెల్లికి చేరువలో ఉన్న లకుడారం వద్ద స్టేజీని ప్రతిపాదించారు. కానీ అతి సమీపంలోనే అన్ని అనుకూలతలున్న కొమురవెల్లిలోనే స్టేషన్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతూ వచ్చా రు. ఈ విషయమై మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, మెదక్‌ ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వె ంకట్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి, తదితరులకు విన్నవించడంతో స్థానికంగా ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కొన్నినెలల క్రితం ప్రకటించిన స్టేషన్ల జాబితాలో కొమురవెల్లి పేరు లేకపోవడంతో గమనార్హం. 

 స్థానికుల ఒత్తిడి మేరకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రైల్వే జీఎం కార్యాలయానికి వెళ్లి విన్నవించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రైల్వే జీఎంకు లేఖ కూడా రాశారు. దీంతో గత మార్చి 28న రైల్వేశాఖ కమర్షియల్‌ ఇన్‌స్పె క్టర్‌ రంగనాథ్‌ కొమురవెల్లికి చేరుకుని స్థలపరిశీలన చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోమారు రైల్వేఅధికారులను కలిశారు. ఇటీవల స్వామివారి కల్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవగా, సం క్రాం తి తరువాత వచ్చే ఆదివారం నుంచి జాతర సాగనుంది. ఇప్పటికే పనులు సాగుతున్న నేపథ్యంలో రైల్వేస్టేషన్‌ ఏర్పాటుపై ఎవరూ అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఈ ఏడాదీ భక్తులకు నిరాశే మిగిలేలా ఉంది.

Updated Date - 2022-01-01T03:48:58+05:30 IST