గ్రామాల మద్దతు కూడగడుతున్న కూచారం యువత
ABN , First Publish Date - 2021-10-30T04:19:24+05:30 IST
టీఎ్‌సఐఐసీ పారిశ్రామికవాడలో ’బీ’ కేటగిరి పరిశ్రమల ఏర్పాటును కూచారం గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తూప్రాన్ (మనోహరాబాద్), అక్టోబరు 29: టీఎ్‌సఐఐసీ పారిశ్రామికవాడలో ’బీ’ కేటగిరి పరిశ్రమల ఏర్పాటును కూచారం గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు పక్క గ్రామాల మద్దతు తీసుకుంటున్నారు. కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర, రీజనల్ కార్యాలయాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జీడిపల్లి సర్పంచు నాయిని రేఖను నేచర్ ఐకాన్ యూత్ కలిసి కంపెనీల కాలుష్యంపై వివరించి, మద్దతు కోరారు. ఈ మేరకు సర్పంచు రేఖ గ్రామ పంచాయతీ తరఫున కంపెనీల ఏర్పాటుపై అభ్యంతర పత్రాన్ని అందజేశారు. కాలుష్య కారక పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.