ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పులిమామిడి రాజు

ABN , First Publish Date - 2021-07-11T04:57:58+05:30 IST

ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సదాశివపేటలోని 12వ వార్డు కౌన్సిలర్‌ పులిమామిడి రాజు నియమితులయ్యారు.

ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పులిమామిడి రాజు
పులిమామిడి రాజుకు నియామక పత్రాన్ని అందజేస్తున్న ఎంపీ బండా ప్రకాశ్‌

సదాశివపేట, జూలై 10 : ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సదాశివపేటలోని 12వ వార్డు కౌన్సిలర్‌ పులిమామిడి రాజు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ముదిరాజ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ చొప్పరి శంకర్‌ ముదిరాజ్‌ శనివారం హైదరాబాద్‌ తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడిగా పులిమామిడి రాజును నియమిస్తూ నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడారు. జిల్లాలో ముదిరాజ్‌లను ఐక్యం చేస్తూ, ముదిరాజ్‌ కులస్తుల అభ్యున్నతికి, పురోగతికి, సంక్షేమానికి, సామాజిక, ఆర్థిక రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో పురోభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చడంలో తగిన రీతిలో, బాధ్యతాయుతంగా పని చేస్తానని పులిమామిడి రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి, సదాశివపేట పట్టణ ముదిరాజ్‌ సంఘం అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి, సదాశివపేట పట్టణ ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు గారెల తుల్జారామ్‌, జిల్లా నాయకులు బోయిన సుధాకర్‌ ముదిరాజ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-11T04:57:58+05:30 IST