కేసీఆర్‌ను తూప్రాన్‌వాసులు గద్దెదింపాలి

ABN , First Publish Date - 2021-01-12T05:43:46+05:30 IST

సోమవారం తూప్రాన్‌లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు అభినందనసభ నిర్వహించారు.

కేసీఆర్‌ను తూప్రాన్‌వాసులు గద్దెదింపాలి
మాట్లాడుతున్న రఘునందన్‌రావు

ఎమ్మెల్యే రఘునందన్‌రావు


తూప్రాన్‌, జనవరి 11 : ప్రజలను పీడించి పాలన సాగించిన నిజాం నవాబును సాగనంపినట్లుగానే కేసీఆర్‌ను గద్దె దింపాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. అది తూప్రానోళ్లే చేయాలని, ఆశక్తి ఇక్కడి వారికే ఉందని చెప్పారు. సోమవారం తూప్రాన్‌లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు అభినందనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన యువత, మైనారిటీలు బీజేపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30 నెలలే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉంటుందని, ఎవరు భయపెట్టినా భయపడొద్దని తెలిపారు. ప్రజల మొర వినాల్సిన ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌, ఫాంహౌజ్‌కే పరిమితమయ్యాడని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో నాయకులు మహేశ్‌గౌడ్‌, దుర్గరాజయాదవ్‌, విఠల్‌, నర్సోజీ, రాంమోహన్‌గౌడ్‌, దళితమోర్చా జిల్లా అధ్యక్షుడు యాదగిరి పాల్గొన్నారు. అనంతరం టాటా కాఫీ కంపెనీలో బీఎంఎస్‌ జెండాను ఆవిష్కరించారు.


Updated Date - 2021-01-12T05:43:46+05:30 IST