హరీశ్‌రావు ఆధ్వర్యంలో 7 నుంచి ‘కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ’

ABN , First Publish Date - 2021-02-06T04:25:02+05:30 IST

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా సిద్దిపేట క్రికెట్‌ స్టేడియంలో ఈ నెల 7నుంచి మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ‘కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ’ని నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్‌ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

హరీశ్‌రావు ఆధ్వర్యంలో 7 నుంచి ‘కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ’
జెర్సీలను ఆవిష్కరిస్తున్న క్రికెట్‌ నిర్వాహకులు

సిద్దిపేట సిటీ, ఫిబ్రవరి 5: సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా సిద్దిపేట క్రికెట్‌ స్టేడియంలో ఈ నెల 7నుంచి మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ‘కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ’ని నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్‌ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని మినీ స్టేడియంలో క్రీడాకారులకు ఇచ్చే జెర్సీలను పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, మల్లిఖార్జున్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పోటీల్లో 60 జట్లు, 800 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్‌గౌడ్‌, జువ్వన్న కనకరాజు, ఆకుబత్తిని రాము తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-06T04:25:02+05:30 IST