అర్హులందరికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందించాలి : సంజీవరెడ్డి
ABN , First Publish Date - 2021-10-22T05:15:33+05:30 IST
అర్హులందరికీ పార్టీలకతీతంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అందజేయాలని టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి అన్నారు.

నారాయణఖేడ్, అక్టోబరు 21 : అర్హులందరికీ పార్టీలకతీతంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అందజేయాలని టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖేడ్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ పథకాలను కాంగ్రె్‌సలో ఉన్నారంటూ పలు గ్రామాల్లో లబ్ధిదారులకు అందించడం లేదన్నారు. 2019లో వివాహాలు జరిగినా ఇప్పటికీ ఆర్థిక సహాయం అందలేదని చెప్పారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, అర్హులైన వారికి ఇవ్వాలని ఆదేశాలిచ్చారని అన్నారు. అయితే స్థానిక నాయకులు మాత్రం తమ పార్టీలో చేరితేనే ఇస్తామని తెలుపుతున్నారన్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి డీఏవో చంద్రకళకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు దరఖాస్తు చేసుకున్నా సహాయం అందని వారి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఆనంద్ స్వరూ్‌పషెట్కార్, యువజన కాంగ్రెస్ నాయకులు సాగర్‌షెట్కార్, మాజీ ఎంపీటీసీ సుధాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మి, చందర్‌నాయక్, బోజిరెడ్డి, మనూరు పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్, తాహేర్‌అలీ, దామ నాగన్న, కృష్ణ, మనోహర్ పాల్గొన్నారు.