కాళేశ్వరం నీళ్లతో కూడవెళ్లి ఇక జీవనది

ABN , First Publish Date - 2021-03-22T05:21:25+05:30 IST

దుబ్బాక నియోజకవర్గానికి జీవనోపాధిగా ఉన్న కూడవెళ్లి వాగు ఇక జీవనదిగా మారనున్నదని, సోమవారంలోగా వాగుకు నీళ్లందించేందుకు సీఎం ఆదేశించడం హర్షణీయమని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

కాళేశ్వరం నీళ్లతో కూడవెళ్లి ఇక జీవనది
మాట్లాడుతున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు కృషితో సాగునీరు

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక, మార్చి 21 : దుబ్బాక నియోజకవర్గానికి జీవనోపాధిగా ఉన్న కూడవెళ్లి వాగు ఇక జీవనదిగా మారనున్నదని, సోమవారంలోగా వాగుకు నీళ్లందించేందుకు సీఎం ఆదేశించడం హర్షణీయమని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాక మండలం గంభీర్‌గూడ గ్రామంలోని పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని పూజలు చేసి మాట్లాడారు. కొన్నాళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే లిఫ్టు గుండా కూడవెళ్లి వాగుకు చేర్చాలని రైతులు కోరగా ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు. గజ్వేల్‌ మండలం కొండపోచమ్మ ప్రాజెక్టుకు వెళ్లే నీళ్లను కొడకండ్ల వద్ద నుంచి కూడవెళ్లికి మళ్లించాలనే ప్రతిపాదనను మంత్రి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. కొడకండ్ల లిఫ్టు నుంచి కేవలం కిలోమీటర్‌ దూరంలో ఉన్న కూడవెళ్లి వాగుకు అనుసంధానం చేసేందుకు సీఎం ఆదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, బక్కి వెంకటయ్య, ఆస యాదగిరి, కౌలా్‌సముదిరాజ్‌, బండిరాజు, బానాల శ్రీనివాస్‌, ప్రభాకర్‌ తదితరులున్నారు. ఇదిలా ఉండగా దుబ్బాకలో వచ్చేనెల 5న బాబూజగ్జీవన్‌రామ్‌ విగ్రహావిష్కరణకు హాజరుకావాలని బాబూజగ్జీవన్‌రామ్‌ యూత్‌ నాయకులు ఎంపీని ఆదివారం కలిసి కోరారు. 

Updated Date - 2021-03-22T05:21:25+05:30 IST