కందిలో ఘనంగా కారల్ మార్క్స్ జయంతి
ABN , First Publish Date - 2021-05-06T05:10:34+05:30 IST
కందిలో కారల్‌మార్క్స్ 207వ జయంతిని బుధవారం ిసీపీఎం నాయకులు ఘనం గా నిర్వహించారు.

కంది, మే 5 : కందిలో కారల్‌మార్క్స్ 207వ జయంతిని బుధవారం ిసీపీఎం నాయకులు ఘనం గా నిర్వహించారు. కారల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి ఖాజా మాట్లాడుతూ కార్మికుల కోసం, వారి సమస్యల పరిష్కారానికి పోరాడిన కారల్ మార్క్స్ మాటలను, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామన్నారు. కార్మిక చట్టాలను పటిష్ఠంగా అమలు జరపడానికి తాము నిరంతరం కృషి చేస్తామని ఖాజా పేర్కొన్నారు. యాదగిరి, సాగర్, మధు, వెంకటేష్ నివాళులర్పించిన వారిలో ఉన్నారు.