అనారోగ్యంతో మర్కుక్‌ విలేకరి మృతి

ABN , First Publish Date - 2021-07-24T05:31:16+05:30 IST

‘ఆంధ్రజ్యోతి’ మర్కుక్‌ మండల విలేకరి ఎర్రంరాజు యువరాజ్‌ (53) అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు.

అనారోగ్యంతో మర్కుక్‌ విలేకరి మృతి

 సంతాపం తెలిపిన మంత్రి హరీశ్‌రావు


గజ్వేల్‌, జూలై 23: ‘ఆంధ్రజ్యోతి’ మర్కుక్‌ మండల విలేకరి ఎర్రంరాజు యువరాజ్‌ (53) అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. మూడు దశాబ్దాలుగా వర్గల్‌, మర్కుక్‌ మండల విలేకరిగా, మర్కుక్‌ మండల సబ్‌పోస్టుమాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన మూడు రోజులు క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. మర్కుక్‌ నూతన మండలంగా ఏర్పాటైనప్పటి నుంచి ఆంధ్రజ్యోతిలో విధులు నిర్వహిస్తున్నాడు. యువరాజ్‌ మృతికి మంత్రి హరీశ్‌రావు సంతాపం ప్రకటించారు. అంత్యక్రియలను అతని స్వగ్రామం వర్గల్‌ మండలం గౌరారంలో నిర్వహించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. అంత్యక్రియల్లో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజావిరాహత్‌అలీ పాల్గొని పాడే మోశారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మర్కుక్‌ ఎంపీపీ అధ్యక్షుడు తాండపాండుగౌడ్‌, జడ్పీటీసీ ఎంబరి మంగమ్మ రాంచంద్రంయాదవ్‌, రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రంగాచారి, సర్పంచులు, పాత్రికేయులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T05:31:16+05:30 IST