చౌడు భూములకు జీలుగ, జనుముతో మేలు
ABN , First Publish Date - 2021-05-19T05:23:35+05:30 IST
చౌడు భూముల్లో జీలుగ, జనుము విత్తనాలు వేసి దున్నితే ఆ భూమి సారం పెరిగి పంటలకు ఎంతో మేలు జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి చైతన్య అన్నారు.
మండల వ్యవసాయ అధికారి చైతన్య
కంది/కల్హేర్, మే 18 : చౌడు భూముల్లో జీలుగ, జనుము విత్తనాలు వేసి దున్నితే ఆ భూమి సారం పెరిగి పంటలకు ఎంతో మేలు జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి చైతన్య అన్నారు. మంగళవారం ఆమె, పీఏసీఎస్ చైర్మన్ దొడ్ల ప్రభాకర్‌రెడ్డి కంది పీఏసీఎస్ వద్ద రైతులకు జీలుగ, జనుము విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది తుంకి అశోక్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, శేఖర్, రైతులు పాల్గొన్నారు. కల్హేర్ మండలంలోని రైతువేదికలో జీలుగ, జనుము విత్తనాలను నారాయణఖేడ్ ఆత్మ చైర్మన్ రాంసింగ్, జడ్పీటీసీ నర్సింహారెడ్డి రైతులకు పంపిణీ చేశారు. ఏవో శశాంక్, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నారాయణరావ్, ఎంపీటీసీ సంగప్ప పాల్గొన్నారు.