తెలంగాణ సాధనలో జయశంకర్‌ సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2021-06-22T05:59:10+05:30 IST

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం పలు కార్యక్రమాలను నిర్వహించారు. పలుచోట్ల ఆయన ఫొటోలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

తెలంగాణ సాధనలో జయశంకర్‌ సేవలు చిరస్మరణీయం
జహీరాబాద్‌లో జయశంకర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం పలు కార్యక్రమాలను నిర్వహించారు. పలుచోట్ల  ఆయన ఫొటోలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ  తెలంగాణ సిద్ధాంత కర్త,  జయశంకర్‌ సార్‌ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 


 సంగారెడ్డి జిల్లాలో..

జహీరాబాద్‌/వట్‌పల్లి, జూన్‌ 21: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆచార్య జయశంకర్‌ చేసిన కృషి అమోఘమని ఎమ్మెల్యే మాణిక్‌రావు పేర్కొన్నారు. సోమవారం జహీరాబాద్‌ పట్టణంలోని  ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయంలో  ఆచార్యజయశంకర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.  కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వట్‌పల్లిలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో జయశంకర్‌ వర్దంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్‌ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వట్‌పల్లి ఏఎంసీ చైర్మన్‌ రజనీకాంత్‌, వరం రైతు సొసైటీ అధ్యక్షుడు వీరారెడ్డి,   పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బుద్దిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


 మెదక్‌ జిల్లాలో..
తూప్రాన్‌/రామాయంపేట/చిన్నశంకరంపేట/అల్లాదుర్గం/టేక్మాల్‌/రేగోడు, జూన్‌ 21:   తూప్రాన్‌లోని బ్రహ్మంగారి ఆలయంలో ప్రొ. జయశంకర్‌ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జిల్లా సంఘం ఉపాధ్యక్షుడు సుగుణాల నారాయణచారి, సభ్యులు   పాల్గొన్నారు.  రామాయంపేటలో జయశంకర్‌ విగ్రహానికి టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేంద ర్‌గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీచైర్మన్‌ సరాఫ్‌ యాదగిరి, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.  చిన్నశంకరంపేట మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో గణే్‌షరెడ్డి తన సిబ్బందితో జయశంకర్‌  ఫొటోకు  పూలమాల వేసి నివాళులర్పించారు.  అల్లాదుర్గంలోని స్థానిక మార్కండేయ మందిరంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఐక్య సంఘం అల్లాదుర్గం అధ్యక్షుడు వడ్ల పాపయ్యచారి,   సంఘం సభ్యులు పాల్గొన్నారు.  టేక్మాల్‌ చౌరస్తాలోని జయశంకర్‌ విగ్రహానికి పార్టీ మండల శాఖ అధ్యక్షుడు భక్తుల వీరప్ప ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సిద్ధయ్య, నాయకులు పాల్గొన్నారు. రేగోడు గాంధీ చౌక్‌ వద్ద తెలంగాణ మండల ఉద్యమకారులు  ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతిని నిర్వహించారు. జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో మండల ఉద్యమకారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T05:59:10+05:30 IST