జయహో..మల్లన్న
ABN , First Publish Date - 2021-02-01T05:45:24+05:30 IST
చేర్యాల, జనవరి 31 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోవారం పురస్కరించుకుని ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఈసందర్భంగా భక్తిప్రపత్తులతో బోనం నివేదించి పట్నాలు రచించారు.

చేర్యాల, జనవరి 31 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోవారం పురస్కరించుకుని ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఈసందర్భంగా భక్తిప్రపత్తులతో బోనం నివేదించి పట్నాలు రచించారు. స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు, బండారి, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వీవీఐపీ, రూ.150, రూ.100, ఉచిత దర్శన క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ప్రత్యేక, ధర్మదర్శన క్యూలైన్ల ఆవరణలో పైప్‌లైన్ లీకేజీతో నీరు సీసీరోడ్డు మీదుగా ప్రవహించడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. ఆలయ ఇన్‌చార్జి ఈవో బాలాజీ, పునరుద్ధరణ కమిటీ సభ్యులు దువ్వల మల్లయ్య, శంకరాచారి, తాళ్లపల్లి శ్రీనివాస్, ఏఈవోలు గంగా శ్రీనివాస్, వైరాగ్యం అంజయ్య, సూపరింటిండెంట్ నీలశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మల్లన్నను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు
కొమురవెల్లి ఆలయాన్ని ఆదివారం తెలంగాణరాష్ట్ర డిప్యూటీ స్పీకర్ టీ.పద్మారావు కుటుంబసమేతంగా సందర్శించారు. మల్లన్నకు పట్నంవేసి బోనం నివేదించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని అభిషేకం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ వీరశైవార్చకులు స్వామి వారి ప్రసాదం అందించి ఆశీర్వదించారు.