జస్ట్‌లిక్‌ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల ఎంపికకు ఆహ్వానం

ABN , First Publish Date - 2021-07-12T05:49:48+05:30 IST

మెదక్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జస్ట్‌లిక్‌ కబడ్డీ ఎంపిక పోటీలను ఈనెల 18న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

జస్ట్‌లిక్‌ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల ఎంపికకు ఆహ్వానం

చిన్నశంకరంపేట, జూలై 11: మెదక్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జస్ట్‌లిక్‌ కబడ్డీ ఎంపిక పోటీలను ఈనెల 18న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనుకునే వారు ఆధార్‌కార్డు, ఫాస్‌ ఫోటోతో హాజరు కావాలని సూచించారు. ఈ క్రీడలో పాల్గొనేవారు రూ. ఏడు వందలు ప్రవేశ రుసుం చెల్లించాలన్నారు. ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. అసక్తి గల వారు 8096701052, 7601072995 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Updated Date - 2021-07-12T05:49:48+05:30 IST