అతిథి అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-11-27T04:55:19+05:30 IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుడి స్థానంలో అతిథి అధ్యాపకుడిని నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ కళింగ క్రిష్ణకుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అతిథి అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం

నారాయణఖేడ్‌, నవంబరు 26: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుడి స్థానంలో అతిథి అధ్యాపకుడిని నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ కళింగ క్రిష్ణకుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉర్దూ మాద్యమానికి సంబంధించి రాజనీతిశాస్త్రం పోస్టు ఖాళీగా ఉందన్నారు. కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన పోస్టు గ్రాడ్యుయేట్లు ఈనెల 30 వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. డిసెంబరు 1న డెమో నిర్వహిస్తామన్నారు. మిగతా వివరాలకు 9849577621, 9704415822 నంబర్లలో సంప్రదించాలన్నారు. 

Updated Date - 2021-11-27T04:55:19+05:30 IST