‘జాతీయ డిజిటల్‌ గ్రంథాలయం వినియోగం’పై అంతర్జాల సదస్సు

ABN , First Publish Date - 2021-07-13T05:02:18+05:30 IST

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం గ్రంథాలయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘జాతీయ డిజిటల్‌ గ్రంథాలయం వినియోగం’పై ఒకరోజు అంతర్జాల సదస్సును సోమవారం నిర్వహించారు.

‘జాతీయ డిజిటల్‌ గ్రంథాలయం వినియోగం’పై అంతర్జాల సదస్సు

 సిద్దిపేట ఎడ్యుకేషన్‌, జూలై 12 : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం గ్రంథాలయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘జాతీయ డిజిటల్‌ గ్రంథాలయం వినియోగం’పై ఒకరోజు అంతర్జాల సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సిహెచ్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ కళాశాలలో దాదాపు 52 వేలకు పైగా పుస్తకాలతో అతిపెద్ద గ్రంథాలయం ఉన్నదని చెప్పారు. వాటితో పాటు కొవిడ్‌ నేపథ్యంలో ఎన్‌-లి్‌స్ట, ఎన్‌డిఎల్‌ఐ వంటి అంతర్జాల వనరులు విద్యార్థులు ఉపయోగించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సదస్సులో పాల్గొన్న ముఖ్యవక్త నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రంథ పాలకులు ఆనందం, దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ డిజిటల్‌ ఇండియాలో భాగంగా ‘ఒక దేశం.. ఒక గ్రంథాలయం’ అనే భావనతోనే దేశంలోని పౌరులందరికీ ఉపయోగపడే విధంగా నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని రూపొందించామన్నారు. ఇందులో పాఠశాల నుంచి జీవితాంతం వరకు నేర్చుకునే విధంగా వివిధ స్థాయిల్లో ఉండే చదువుల కోసం 67 లక్షల పుస్తకాలు, 7 లక్షల థీసిస్‌, 4 లక్షలకు పైగా వీడియోలు తదితర రూపాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. వీటన్నింటిని ఎవరైనా ఉచితంగానే వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డా.కె.హుస్సేన్‌, ఇన్‌చార్జి గ్రంథ పాలకులు డా.అస్రారుల్‌ హక్‌, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్‌ డా. సిహెచ్‌.మధుసూదన్‌, అకాడమిక్‌ కో-ఆర్డినేటర్‌ డా.గోపాల సుదర్శనం, అధ్యాపకులు డా.పి.అయోధ్యరెడ్డి, శైలజ, ఖాజాబీ, నిర్మలకుమారి, గుణాకర్‌, శ్యామ్‌సుందర్‌, చక్రహరి రమణ, భరత్‌, ఇతర కళాశాలల గ్రంథాపాలకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T05:02:18+05:30 IST