గజ్వేల్‌లో ఇంటిగ్రేటెడ్‌ సెంట్రల్‌ నర్సరీ

ABN , First Publish Date - 2021-05-21T05:37:21+05:30 IST

సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ములుగు సమీపంలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్‌ సెంట్రల్‌ నర్సరీని ఏర్పాటు చేయాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎ్‌సఎ్‌ఫడీసీ) నిర్ణయించింది

గజ్వేల్‌లో ఇంటిగ్రేటెడ్‌  సెంట్రల్‌ నర్సరీ

20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఇక్కడి నుంచే సరఫరా

అటవీ అభివృద్ధి సంస్థ నిర్ణయం


హైదరాబాద్‌, మే 20(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ములుగు సమీపంలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్‌ సెంట్రల్‌ నర్సరీని ఏర్పాటు చేయాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ     (టీఎ్‌సఎ్‌ఫడీసీ) నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఇక్కడి నుంచే మొక్కలను సరఫరా చేసే విధంగా సెంట్రల్‌ నర్సరీని అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. టీఎ్‌సఎ్‌ఫడీసీ మూడో వార్షిక సమావేశం చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అధ్యక్షతన ఆన్‌లైన్‌లో గురువారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణం, అటవీ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని టీఎ్‌సఎ్‌ఫడీసీ పునర్వ్యవస్థీకరించాలని సమావేశంలో నిర్ణయించినట్లు ప్రతా్‌పరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కొత్తగూడలో టీఎ్‌సఎ్‌ఫడీసీ కార్యాలయం కోసం ఏకో టూరిజం కాంప్లెక్స్‌ను నిర్మించాలని తీర్మానించినట్లు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కార్పొరేషన్‌ విభజన ప్రక్రియ పూర్తయిందని, సెటిల్‌మెంట్‌లో భాగంగా రూ.51.02 కోట్లను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందని టీఎ్‌సఎ్‌ఫడీసీ వైస్‌చైర్మన్‌, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మొత్తం టర్నోవర్‌ రూ.150 కోట్లు కాగా 95.49 కోట్ల లాభాలను అర్జించినట్లు వెల్లడించారు. కరోనా విపత్తులో మృతదేహాల దహన సంస్కారాలకు 150 మెట్రిక్‌ టన్నుల కలపను ఉచితంగా సరఫరా చేసినట్లు తెలిపారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అటవీశాఖ ఉన్నతాధికారులు స్వర్గం శ్రీనివాస్‌, సిద్దానంద్‌ కుక్రేటి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-21T05:37:21+05:30 IST