భూమి పట్టా మార్పిడిపై విచారణ
ABN , First Publish Date - 2021-09-04T03:50:12+05:30 IST
పట్టా భూమిని అక్రమంగా మార్పిడి చేశారని మండలంలోని దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అధికారులు స్పందించి శుక్రవారం వివాదాస్పద భూమిపై విచారణ చేశారు.

కొండపాక, సెప్టెంబరు 3: పట్టా భూమిని అక్రమంగా మార్పిడి చేశారని మండలంలోని దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అధికారులు స్పందించి శుక్రవారం వివాదాస్పద భూమిపై విచారణ చేశారు. అడిషనల్ కలెక్టర్ ముజామిల్‌ఖాన్, గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి వెలికట్ట శివారులోని 335సర్వేనంబర్‌లోని భూమిని పరిశీలించారు. పట్టా ఎవరి పేరున ఉంది, ఎలా మారింది? అనే విషయాలను పరిశీలించారు. పట్టా మార్చుకున్న వెలికట్టకు చెందిన కిష్టయ్యను, బాధితురాలు లక్ష్మిని అధికారులు విచారించారు. అక్రమంగా పట్టా మార్పిడి జరిగినట్లు విచారణలో తేలితే చర్యలు తప్పవని ఆర్డీవో విజయేందర్‌రెడ్డి వెల్లడించారు.