కొనుగోలు కేంద్రాల్లో విచారణ జరపాలి

ABN , First Publish Date - 2021-10-20T04:33:01+05:30 IST

: ఐకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్ని కొనుగోలు కేంద్రాల్లో పూర్తిస్థాయి విచారణ జరపాలని, ధాన్యం కొనుగోళ్లలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో విచారణ జరపాలి
మద్దూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న కొండల్‌రెడ్డి, నాయకులు

 అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి

 జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి


మద్దూరు, అక్టోబరు 19: ఐకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్ని కొనుగోలు కేంద్రాల్లో పూర్తిస్థాయి విచారణ జరపాలని,  ధాన్యం కొనుగోళ్లలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. చేర్యాల, మద్దూరు, కొమురవెళ్లి మండల కేంద్రాల్లోని వ్యాపారులను కేంద్రంగా చేసుకుని అధికార పార్టీ సానుభూతిపరులైన కొందరు కోట్ల రూపాయలు కొల్లగొట్టిన విషయం నెల రోజుల నుంచి రాష్ట్రంలోనే హాట్‌ టాపిక్‌గా మారిందన్నారు. మంగళవారం మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారులను కేంద్రంగా చేసుకుని గంప రాజు అనే వ్యక్తి కోట్ల రూపాయలు కొల్లగొట్టాడని ఆరోపించారు. దీని వెనుకాల ఎవరెవరి హస్తం ఉందో వెలికి తీసి అరెస్టు చేయాలని, వారి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బండి శ్రీనివాస్‌, నాయకులు షౌకత్‌అలీ, బొప్పె నాగయ్య, కనకచంద్రం పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:33:01+05:30 IST